ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారులు వానకాలం సాగు సమగ్ర సర్వే(క్రాప్ బుకింగ్) చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో రైతు ఏఏ పంటలు వేశాడు? ఎన్ని ఎకరాల్లో వేశాడు? అనే విషయా లు తెలుసుకుంటున్నారు. జిల్లాలో 101 వ్యవసా య క్లస్టర్లు ఉండగా.. వ్యవసాయ విస్తరణ అధి కారులు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ పంటల వివరాలను వ్యవసాయ యాప్‌లో నమో దు చేస్తున్నారు. రైతులవారీగా పంటల వివరాల ను పకడ్బందీగా తయారు చేయడంతో కొనుగో ళ్లు, ఎరువుల అమ్మకాలు లాంటి వాటిల్లో ఎలాం టి ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు.
– ఆదిలాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూలై 14 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జి ల్లాలో వానకాలం పంటల సాగు మొదలైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.47 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సీ జన్ ప్రారంభంలో రైతులు వేసిన పత్తి, సోయాబిన్, కంది విత్తనాలు మొలకెత్తాయి. వర్షాల అనుకూలిస్తుండడంతో పంటలు ఏ పుగా పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పంటల సాగు వివరాలు అస్తవ్యస్తంగా ఉండేవి. పంటలు ఎన్నెకరాల్లో సాగవుతున్నాయో, ఏఏ పంటలు పండిస్తున్నారనే విషయాలు తెలిసేవి కావు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిత తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు వివరాల సేకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పంటల సమగ్ర సర్వే (క్రాప్ బుకింగ్ ) నిర్వహిస్తున్నా రు. జిల్లాలో 101 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏడీవో)లో గ్రామాల్లో పంటల వివరాలను సేకరిస్తున్నారు. క్లస్టర్ల పరిధిలో రైతులు ఎన్నెకరాల్లో ఏఏ పంటలు సాగుచేశారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలను వ్యవసాయశాఖ యాప్‌లో నమోదు చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయశాఖ చేపడుతున్న క్రాప్ బుకింగ్ వల్ల రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి.
పకడ్బందీగా పంటల కొనుగోళ్లు
జిల్లాలో వానకాల సీజన్‌కు సంబంధించి వ్యవసాయశాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పంటల సమగ్ర సర్వే ( క్రాప్ బుకింగ్ )తో కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ ఇతర ప్రయోజనాలు కలుగనున్నాయి. జిల్లాలో రైతులు వానకాలంలో సాగుచేసిన పత్తి, సోయాబిన్, కంది, వరి, యాసంగిలో పండించిన శనగ, జొన్న, వరి పంటల ను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల హవా కొనసాగేది. రైతుల వద్ద తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసిన దళారులు ప్రభుత్వ కేంద్రాల్లో ఎక్కువ ధరకు అమ్మేవారు. క్రాప్ బుకింగ్ వల్ల దళారులు దందాకు అడ్డుకట్ట పడింది. ఈ సర్వేలో భాగంగా వ్యవసాయశాఖ సిబ్బంది రైతుల పేర్లు, భూమి సర్వే నంబరు, ఆధార్‌కార్డు నంబరు, బ్యాంకు వివరాలను నమోదు చేస్తారు. వివిధ పంటలను ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారనే విషయాలు తెలుసుకుంటారు. దీంతో రైతులు మాత్రమే ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాల వద్ద వివరాలు తెలియజేసి పంటలను విక్రయించాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారులు సై తం పం ట దిగుబడులను అంచనా వేసి కొనుగోళ్ల ప్రణాళికలు త యారు చేసుకుంటారు. జిల్లాలో జరుగుతున్న క్రాప్ బుకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.