కాసిపేట, మే 12 : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇస్తామనడంతో ఆనందంగా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన లబ్ధిదారులు చివరికి ఎమ్మెల్యే రాకపోవడంతో.. నిరాశతో వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం కాసిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
దీంతో లబ్ధిదారులు ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి గంటల తరబడి వేచి ఉన్నారు. మంత్రి సీతక్క పర్యటనకు ఎమ్మెల్యే వెళ్లడం.. తర్వాత చెక్కులు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో.. వారంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్ భోజన్నను వివరణ కోరగా ఎమ్మెల్యే మంత్రి పర్యటనలో బిజీగా ఉన్నారని, దీంతో చెక్కుల పంపిణీ వాయిదా వేశామని, మంగళవారం లబ్ధిదారులకు చెక్కులు అందిస్తామని తెలిపారు.