ఇంద్రవెల్లి : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ (Cyber crimes ) పోలీసులు వై సంతోష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన ( Awareness ) కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.
అనుమానితులు కాల్ చేస్తే బ్యాంక్ వివరాలు, తదితర వాటిని తెలియజేయవద్దని అన్నారు. ఫోన్ లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీయం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ కేవైసీ అప్డేట్ వివరాలు అడిగితే చెప్పకూడదని సూచించారు . సైబర్ నేరాలకు గురైనపుడు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.