మంచిర్యాల అర్బన్, మార్చి 28 : మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఎన్నికల కమిషనర్ అనిల్ రాజ్, అసిస్టెంట్ కమిషనర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. 312 మంది సభ్యులు (న్యాయవాదులు) ఉండగా, 287 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి వాతవరణం కనిపించింది. అధ్యక్ష పదవి కోసం బండవరపు జగన్, రంగు మల్లేశ్, పులి రాజమల్లు, కొత్త సత్తయ్య.., మరిన్ని పదవుల కోసం 22 మంది ఇ తర న్యాయవాదులు పోటీలో ఉన్నారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించిన అధికారులు అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. బండవరపు జగన్, కొత్త సత్త య్య మధ్య పోటీ హోరాహోరీగా సాగగా, సత్తయ్యకు 114, జగన్కు 136 ఓట్లు పోల్ అయ్యా యి. 22 ఓట్ల మెజారిటీతో రెండోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్ గెలుపొందారు. అనంతరం పూర్తి కార్యవర్గాన్ని అధికారులు ప్రకటించారు.
వైస్ ప్రెసిడెంట్గా బుజంగరావు, జనరల్ సెక్రటరీగా మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీగా ఆ వునురి సత్తయ్య, ట్రెజరరీగా దత్తాత్రేయ, లైబ్రరీ సెక్రటరీగా రంజిత్ గూడ్, స్పోర్ట్స్ సెక్రటరీగా రం గు వేణుకుమార్, లేడీ రిప్రజెంటీటివ్గా బోగె ఉమారాణి, కమిటీ మెంబర్లుగా గాజుల లక్ష్మీప్రసన్న, మల్లేశ్ సందేల, ప్రదీస్ చంద్ర సోమ, సుందూజ కొత్తూరి, శ్రీకాంత్ పెసరను బార్ కౌన్సిల్ సభ్యులు ఓట్లు వేసి గెలిపించారు. అనంతరం ఎన్నికైన సభ్యులు సంబురాలు చేసుకున్నారు. జగన్కు పలువురు న్యాయవాదులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.