నార్నూర్, మార్చి 17 : పంచాయతీ పరిధిలోని వార్డుల సమస్యలు దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం లోని ప్రాంగణంలో పాలకవర్గం సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ గ్రామసభలో పాలకవర్గ సభ్యులు, ఆయా శాఖల అధికారులు,స్థానికులు పాల్గొన్నారు.
వార్డులోని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ప్రజలందరి సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. గ్రామస్తులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డీప్యూటీ తహసీల్దార్ శ్యాంసుందర్,ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, కార్యదర్శి మోతిరామ్ తదితరులున్నారు.