మందమర్రి, ఫిబ్రవరి 19 : అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నాయకులతో కలసి పరామర్శించారు. ఐదు రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బాల్క సుమన్ బుధవారం దవాఖానకు వెళ్లి ఓదెలుకు, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. బాల్క సుమన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు త్వరగా కోలుకొని ప్రజా జీవితాన్ని కొనసాగించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారమేశ్, రిక్కుల మధూకర్ రెడ్డి, జే.రవీందర్, కొంగల తిరుపతి రెడ్డి, బడికెల సంపత్ ఉన్నారు.