దండేపల్లి /చెన్నూర్ టౌన్/ జైనూర్, జూన్16: ఇబ్రహీం అలైహిస్సాలాం త్యా గానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే ఈద్-ఉల్-అజ్హా(బక్రీద్)కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లాహ్ ముఖ్య ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఇస్లాం విశ్వాసాలను ప్రపంచమంతా ప్రచారం చేసేవాడు. ఇబ్రహీంకు పెళ్లయిన చాలా ఏండ్లకు కుమారుడు జన్మిస్తాడు. అతనికి ఇస్మాయిల్ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. అల్లాహ్(దైవం) వరుసగా మూడు రోజులు ఇబ్రహీం కలలోకి వచ్చి ‘నీ కుమారుడిని బలి ఇవ్వాలి’ అని సందేశాన్ని వినిపిస్తాడు. అల్లాహ్ కోసం ఇబ్రహీంతో పాటు ఆయన భార్య అంగీకరిస్తారు.

తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఇస్మాయిల్ సంతోషంగా ప్రాణత్యాగానికి సిద్ధ్దమవుతాడు. దీంతో అల్లాహ్ దైవవాణి ద్వారా ‘ఇబ్రహీం ఇది నిన్ను పరీక్షించేందుకే..నా పరీక్షలో నీవు గెలిచావు. కుమారుడి బదులు ఓ జీవాన్ని (గొర్రె)బలి ఇ వ్వు’ అని కోరుతాడు. ఆ రోజును బక్రీద్ గా నిర్వహిస్తున్నారు. ఖుర్భానీగా జంతువును బలి ఇస్తున్నారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హజ్ 22న బక్రీద్‌ను జరుపుకుంటారు. బక్రీద్‌కు ముందు రోజు కుటుంబ సభ్యుల సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహా ర పదార్థాలు, వస్తువులు ఉంచుతారు.
రంజాన్ మాదిరిగానే బక్రీద్ పండుగను కూడా ఖుద్భా(ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నెమరువేసే జంతువులు (ఒంటే, మేక, గొర్రె ) మాత్రమే ఖుర్భానీ(బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకో భాగం తమ కోసం ఉంచుకుంటారు. హజ్ చేయలేని వారు కేవలం తామున్న చోటే అందరూ కలిసి సామూహికంగా నమాజ్ చేసుకోని ఖుర్భానీ సమర్పించుకొని పండుగ చేసుకుంటారు.
ఖుర్బానీ(బలి)ఇచ్చేందుకు మేకలు, గొర్రెలను ఇప్పటికే కొనుగోలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు దండేపల్లి, తాళ్లపేట, ముత్యంపేట, లక్షెట్టిపేట, జన్నా రం, చెన్నూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జైనూర్ మండలం జంగాం, గౌరి, తదితర గ్రామాల్లో ఈద్గాలు, మసీదులను ముస్తా బు చేశారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో పోలీసులు పీస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.