మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం బక్రీద్ వేడుకలను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశాలు ఇచ్చారు. బక్రీద్ పండగ విశిష్టతను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖుర్బానీ చేసి పేదలకు దానం చేశారు. బంధువులు, ఆత్మీయులను ఇళ్లకు పిలిచి విందు ఇచ్చారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.