తాంసి : భూ భారతి ( Bhu Bharati ) చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah ) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టా ఉండి భూమి లేని రైతులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల ప్రజలు, రైతులు అట్నంగూడ గ్రామంలో పశువులకు తాగేందుకు నీళ్లు కూడా లేవని ఫిర్యాదు చేశారు. తాంసి మత్తడివాగులో పూడికతీత పనులు చేపట్టాలని మాజీ సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్( Urdu Academy Chairman) తాహేర్ బిన్ హందాన్ ( Taherbir Hamdan) , ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి , జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, తాజా మాజీ జడ్పీటీసీలు తాటిపళ్లి రాజు , గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ సురకుంటి మంజుల శ్రీధర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.