బజార్ హత్నూర్ : మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన భగత్ సంతోష్ (36)అనే ఆటో డ్రైవర్ (Auto driver suicide) అప్పుల బాధతో గురువారం మృతి చెందాడు. ఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం రాంనగర్ గ్రామానికి చెందిన భగత్ సంతోష్‌కు రూ.4లక్షల వరకు ప్రైవేట్ అప్పులు ఉండడంతో మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో పంట పొలాల వద్ద చెట్టుకు ఊరి వేసుకొని మృతి చెందాడు.
అటు వైపుగా వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. భార్యా రోజా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.