తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) పలువురు గాయపడ్డారు. మండలంలోని వడ్డాడి ఎక్స్ రోడ్ వద్ద ఆటో(Auoto), బైక్ (Bike) ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున ఆటోలో ఇద్దరు, బైక్ పైన ఇద్దరు కూరగాయలు అమ్మడానికి ఆదిలాబాద్ వెళ్తున్న క్రమంలో వడ్డాది ఎక్స్ రోడ్ వద్ద పశువు అడ్డం రావడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.