నార్నూర్, సెప్టెంబర్ 30 : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచ్ ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని త్రిరత్న బుద్ధ విహార్ లోని భవన్ లోజిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఎస్ ఇ ఆర్ పి సహకారంతో బాంబు క్రాఫ్ట్ సంఘం సభ్యులకు అందించిన పరికరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న సామాగ్రిలను వెదురుతో తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావు, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తమ్, నాయకులు లోకండే దేవ్ రావ్, రాథోడ్ బిక్కు, ప్రకాష్,కోరల మహేందర్, ఫిరోజ్ ఖాన్, సుల్తాన్ ఖాన్,దుర్గే రుక్మాబాయి, మీనాబాయి తదితరులున్నారు.