నస్పూర్, సెప్టెంబరు 5 : పోషణ్ అభియాన్ ద్వారా పోషణ లోపాన్ని అధిగమించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో ఇన్చార్జి జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, జడ్పీసీఈవో గణపతి, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి ఈ నెల 30న వరకు తలపెట్టిన పోషణ్ మాహ్-2024 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారంపై గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లలకు కథల పుస్తకాలు అందించి చదవడంపై ఆసక్తి పెంచాలని తెలిపారు. అనంతరం ప్రతిజ చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు విజయలక్ష్మి, రేష్మ, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త రజిత, ఉమెన్ హబ్ టీం, సూపర్ వైజర్లు, డీపీఏలు, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.