సిర్పూర్ యు: ఆపదలో ఉన్న వారిని యూనియన్ తరఫున అన్ని విధాల ఆదుకుంటుందని మేస్త్రి యూనియన్ మండల అధ్యక్షుడు ఆత్రం గంగారం అన్నారు. గత కొన్ని నెలలుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న గౌస్ మేస్త్రికి యూనియన్ తరఫున ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి వారు ఆపదలో ఉన్నప్పుడు యూనియన్ సభ్యులు ముందుకు వచ్చి ఆదుకోవడం ఎంతో మంచిదన్నారు.
ప్రతిరోజు కలిసిమెలిసి పనిచేసేవారు అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు తనకు సంఘం తోడుంటుంది అనే నమ్మకం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఆత్రం మారుతి, నాగోరావు సుభాష్, బాబురావు, జంగు, భారత్, రాజు తదితరులు పాల్గొన్నారు.