ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓట్ల పండుగకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరుగనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పది నియోజకవర్గాలకు అధికార యంత్రాంగం ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం తీసుకెళ్లారు. సాధారణంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 5 గంటల వరకు ఉండగా.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గంట ముందే ముగియనుంది. ఆదిలాబాద్ జిల్లాలో 75, నిర్మల్‌లో 229, మంచిర్యాలలో 167, ఆసిఫాబాద్‌లో 190 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా.. ఆసిఫాబాద్‌లో అతిసమస్యాత్మక కేంద్రాలు 122 ఉన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– ఆదిలాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరగ నుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మే రకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎం పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని తీసుకొని ఎన్నికల అధికారులు, సిబ్బంది వారికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 923 పోలింగ్ కేంద్రాలు ఉండగా 7.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాలలో 743, ఆసిఫాబాద్‌లో 599, ఆదిలాబాద్ 592 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్లో పోలింగ్ గంట ముందు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ము థోల్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉండనుంది.
అన్ని జిల్లాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లాలో 75, నిర్మల్ జిల్లాలో 229, మంచిర్యాలలో 167, ఆసిఫాబాద్‌లో 190 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆసిఫాబాద్‌లో అతిసమస్యాత్మాక కేంద్రాలు 122 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతి సెంటర్ నుంచి లైవ్ బెబ్క్యాస్టింగ్ కూడా చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి మానిటరింగ్ చేయనున్నారు. ఎక్కడా చదురు,ముదురు ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మూడు నియోజకవర్గాలో పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు 2800 మంది పోలీసులను కేటాయించారు.
మంచిర్యాల జిల్లాలో సర్వసిద్ధం..
మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లోని ఈవీఎం పంపిణీ కేంద్రాల నుంచి అధికారులు ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకొని బుధవారం సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో 277 పోలింగ్ కేంద్రాల్లో 1,88,283 మంది, బెల్లంపల్లిలో 227 పోలింగ్ కేంద్రాల్లో1,73,335 మంది, మంచిర్యాలలో 287 పోలింగ్ కేంద్రాల్లో 2,74,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జి ల్లాలో ఎన్ఆర్ఐ ఓటర్లు 31 మంది, సర్వీస్ ఓటర్లు 631 మంది ఓటుహక్కును వి నియోగించుకోనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 12 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఐదు చొప్పున, యూత్‌కు ఒక పోలింగ్ స్టేషన్‌ను మోడల్ పోలింగ్ స్టేషన్‌గా తీసుకొని ఏర్పాట్లు చేశారు. మూడు నియోజకవర్గాల్లోనూ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లాలలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ ఆ సిఫాబాద్, నవంబర్ 29: జిల్లాలోని ఆసిఫాబాద్, సి ర్పూర్ నియోజకవర్గాల పరిధిలో 4,53,538 మంది ఓటర్లు గురువారం తమ ఓటు హక్కుని వినియోగించుకోన్నారు. ఇందుకోసం 599 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305, సిర్పూర్ నియోజకవర్గంలో 294 పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 92 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 438 కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ ఏ ర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 పారా మిలటరీ దళాలతోపాటు 220 మం ది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2200 మంది పోలీసులు ఎన్నికలకు భద్రత కల్పిస్తున్నా రు. జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. భద్రత దృష్ట్యా సా యంత్రం 4 గంటలకు పో లింగ్ ముగించనున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 13 మంది, ఆసిఫాబాద్ నియోజకవర్గం లో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. రిటర్నింగ్ ఆధికారి దాసరి వేణు ఎ న్నికల సామగ్రిని బుధవారం పోలింగ్ ఆధికారులకు అ ప్పగించారు. సిబ్బంది ఇప్పటికే కేంద్రాలకు చేరుకు న్నారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భోజన వసతి కల్పించడంతో పాటు రవాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాలు.. 23,58,892 మంది ఓటర్లు.
సమస్యాత్మక కేంద్రాలు 661.. అతి సమస్యాత్మక సెంటర్లు 122
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ టౌన్, నవంబర్ 29: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నిర్వహించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో 1468, ముథోల్‌లో 1496, ఖానాపూర్‌లో 604 పో లింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ని ర్మల్‌లో 13 మంది, ముథోల్‌లో 14, ఖానాపూర్‌లో 12 మంది అభ్యర్థులు పోటీలో ని లబడ్డారు. జిల్లా లో 3,66,683 మహిళా ఓటర్లుండగా 3,44,458 పురుషులు, 49 మంది ట్రాన్స్జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 922 పోలింగ్ కేంద్రాల్లో 664 పోలింగ్ కేంద్రాల్లో మైదాన ప్రాంతాల్లో ఉం డగా మిగతావి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన యంత్రాం గం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిం ది. పోలింగ్ సిబ్బందికి నిర్మల్, ఉట్నూరు, ముథోల్‌లో బుధవారం ఎన్నికల సామగ్రిని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. సామగ్రితో ఇప్పటికే సి బ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. నిర్మల్ ఎ న్నికల రిటర్నింగ్ అధికారి రత్నాకల్యాణి, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లాలోని కార్మికులందరికీ వేతనం తో కూడిన సెలవును ప్రకటించినట్లు కార్మికశాఖ సహాయ అధికారి సాయిబాబా తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి : అశిష్ సంగ్వాన్, నిర్మల్ కలెక్టర్
ప్రజలందరూ తమ ఓటు హక్కును విని యోగించుకోవాలి. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాం. ఏదైనా గుర్తింపుకార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తాం.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్, నవంబరు 29 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 4,45,540 మంది ఓటర్లు ఉండగా 2,17,949 మంది పురుషులు, 227582 మంది మహిళలు , 9 మంది ఇతరులు ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,38190 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,16,970 మంది, మహిళలు 1,21,224 మంది, ఇతరులు 6గురు, బోథ్ నియోజకవర్గంలో 2,07,350 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,00, 979 మంది, మహిళలు 1,06,368, ఇతరులు ముగ్గురు ఉన్నారు. జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఆదిలాబాద్‌లో 290, బోథ్‌లో 302 ఏర్పాటు చేశారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ
అధికారులు బుధవారం పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 347 మంది పీవోలు, 347 మంది ఏపీవోలు, 644 మం ది సిబ్బంది, బోథ్‌లో 362 మంది పీవోలు, 362 మంది ఏపీవోలు 724 మంది సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్ టీటీడీసీ పంపిణీ కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, బోథ్ రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్‌పేయి బోథ్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో తరలివెళ్లారు.
విధులకు హాజరు కాని వారి వివరాలు కలెక్టర్‌కు అందజేస్తాం
ఎన్నికల విధులు కేటాయించిన వారిలో రిపోర్ట్ చే యకుండా అలసత్వం వహించిన వారి వివరాలను కలెక్టర్‌కు అందజేస్తామని రిటర్నింగ్ ఆధికారి, అదనపు కలెక్టర్ దాసరి వేణు తెలిపారు.ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
-దాసరి వేణు,రిట్నరింగ్ ఆధికారి,ఆసిఫాబాద్