ఆసిఫాబాద్, మార్చి1 : ఆటల్లో గెలుపోటము లు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ సాయుధ బలగాలకు బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణా ప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్ఐఎం అంజన్న, ఆర్ఐ స్పెషల్ పార్టీ షేక్ నాగుల్ మీర, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు తమ సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సురేశ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని, ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టా గ్రాం వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 87126 70564, డయల్ 100 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.