ఆసిఫాబాద్ టౌన్, మే15 : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. బుధవారం విలేకరులతో ఎస్పీ మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ టీములు, చెక్ పోస్ట్లు, సివిల్ పోలీస్, స్టాటికల్ సర్వైవ్ లెన్స్ సిబ్బంది, అధికారులు, మహిళా సిబ్బంది, హోంగార్డులు, ట్రెయినీ కానిస్టేబుళ్లు, సీఆర్పీఎఫ్ పోలీసులు, అధికారులు మొత్తం 2000 మందితో బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.