RTC JAC | ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, ఫిబ్రవరి 8 : హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్టీసి జేఏసీ చైర్మన్ టీ దివాకర్ అన్నారు. ఈ నెల 9 నుంచి జరిగే నిరవధిక సమ్మె వాల్ పోస్టర్ను శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో అవరణలో జేఏసీ నాయకులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీలను చెల్లించాలని, సీసీఎస్ డబ్బులు కేటాయించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అలాగే ఆర్టీసీ సంస్థలో నెలకొన్న ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.