ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 30: కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు ఇస్తామన్న తులం బంగారం లబ్ధిదారులకు ఎప్పుడిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే 6 గ్యారెంటీలను అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంస్కతీ సంప్రదాయాలకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన మాదిరిగానే ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలని కోరారు.