వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు
ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. ఎస్పీ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
- ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ ప్రభాకర్
- కాగజ్‌నగర్ పట్టణంలోని వ్యాపారుల ఇళ్లలో సోదాలు
- అప్పు పత్రాలు, నగదు స్వాధీనం
కాగజ్‌నగర్, ఏప్రిల్ 13: ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. ఎస్పీ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఐదు టీంలు మూకుమ్మడిగా సోదాలు నిర్వహించాయి. ఓల్డ్ కాలనీకు చెందిన సాబీర్ ఇంట్లో ప్రామిసరీ నోట్స్, నాన్ జ్యుడీషియల్ బాండ్స్, బ్లాంక్ చెక్స్, రూ.3.01 లక్షలు, తైబనగర్కు చెందిన చిదిరాల రాజశేఖర్.
ఇంట్లో లెనోవా వాహనం, 205 మందికి సంబంధించిన అప్పు పత్రాలు, నగదు, నేషనల్ టైలర్ షాపు సమీపంలో సంతోష్ ఇంట్లో సంతకం లేని చెక్కులు, సంతకం గల చెక్కులు, నాన్ జ్యుడీషియల్ బాండ్స్, బ్యాంకు పాసు బుక్‌లు, ప్రామిసరీ నోట్స్, రాయని ప్రామిసరీ నోట్స్, ఏటీఎం కార్డులు, బంగారం, సెల్‌ఫోన్స్, రిజిస్టర్స్ లభించినట్లు ఏఎస్పీ స్పష్టం చేశారు. వీరంతా అమాయక ప్రజల వద్ద అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూన్నారని, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, పట్టణ సీఐ శంకరయ్య, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు.
వాంకిడిలో..
వాంకిడి, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని పలు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వడ్డీ, చీటీ వ్యాపారులతో పాటు ఏజెంట్లు ఇళ్లు, షాపుల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. కోటిపల్లి రవి, బుట్లే కార్తీక్ వద్ద నుంచి విలువైన డాక్యుమెంట్లు, చెకులు, డైరీతో పాటు రూ. 2.46 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

