మహబూబ్‌నగర్, ఆగస్టు 12 : జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్-7 డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల బదిలీల్లో డీఐజీ చౌహాన్ చేతివాటం ప్రదర్శించారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడిని బదిలీ చేసి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలం గాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితుడిని రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కీలక విచారణకు రంగం సిద్ధమైంది.