నిర్మల్ చైన్గేట్, మే 20 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్మల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్య కర్తలు గాంధీపార్కు వద్ద ధర్నా చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు.
రైల్వే, రోడ్డు, ఎయిర్వేస్, టెలీకం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రజల ఆస్తిని ప్రైవేట్ లాభాల కోసం ఉపయోగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామల, జిల్లా నాయకులు భాగ్య, మంగ, సౌమ్య, లక్ష్మి, అనురాధ, విజయ, తిరుమల, సుమలత, పద్మ, గంగాలక్ష్మి, శారద, స్వరూప, భారతి పాల్గొన్నారు.