లగచర్ల రైతులపై అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్భందించినందుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో, బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి, మందమర్రిలోని సింగరేణి పాఠశాల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ విగ్రహానికి, కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి వినతి పత్రం అందించారు.
– నమస్తే నెట్వర్క్
Adilabad3