జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షకు ఏర్పాట్లు
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించారు. 177 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, లక్ష మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు
- తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్షా కేంద్రాలు
- 177 పోస్టులకు లక్ష దరఖాస్తులు
- వివరాలు వెల్లడించిన సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్
- హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచన
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించారు. 177 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, లక్ష మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. మొత్తం 187 కేంద్రాల్లో ఉదయం పదింటి నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనుండగా, హాల్‌టికెట్‌లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయాన సూచించారు.
శ్రీరాంపూర్, ఆగస్టు 29 : సెప్టెంబర్ 4వ తేదీన జరుగనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) రాత పరీక్ష కోసం 8 జిల్లాల్లోని 187 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. 177 పోస్టులకు 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అందులో 98,880 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. httph: tssccl. onlineportal. org.in/SiteContent/Halltickets వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థి అప్లికేషన్ నంబర్ గానీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి రీజియన్‌కు ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్‌ను నియమించామని, ప్రతి కేంద్రానికి పర్యవేక్షకులు ఉంటారని వివరించారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

