భీంపూర్, డిసెంబర్ 11 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో ఉష్ణోగ్రత పడిపోయింది. మంగళవారం 11 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. బుధవారం 8.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అర్లి సహా గుబిడి, కొజ్జన్గూడ , రాంపూర్, గోముత్రి, కరంజి(టి), అంతర్గాం, వడూర్, గొల్లగఢ్, తాంసి(కె) శివారులో చలి తీవ్రత అధికంగా ఉన్నది. రాత్రి వేళ జనం చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. గతంలో మాదిరిగా అర్లి సహా పెన్‌గంగ పరీవాహక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బ్లాంకెట్ల వంటివి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.