నస్పూర్, ఆగస్టు 4 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులు, అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను స్వీకరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్‌లో..
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 4:ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పరిషరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఎస్పీ కాంతిలాల్ పాటిల్ స్వీకరించారు. ఆయా స్టేషన్లకి ఫోన్ చేసి సమస్యలను పరిషరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీసీ కిరణ్, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులున్నారు.