కుంటాల, నవంబర్ 5 : కుంటాల మండలంలోని అంబుగాంకు చెందిన పశువుల కాపరులు మారుతితోపాటు మరో ఇద్దరు అడవిలో పశువుల మందను పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పెద్దపులి మందలోని ఆవు మెడ, కాలుపై దాడి చేసి గాయపర్చింది. అదే సమయంలో రాథోడ్ వినోద్‌కు చెందిన ఆవు అడవిలో తప్పిపోయింది. మంగళవారం మరోసారి కూడా అదే పశువుల కాపరి మారుతికి అడవిలో పులి కనిపించినట్టు తెలిపాడు.
ఎఫ్‌ఎస్‌వోలు పూర్ణిమ, కీర్తి, లక్ష్మణ్, ఎఫ్‌బీవో లు హరిలత, కృష్ణ, మహేశ్, రాజేశ్ బృందాలుగా ఏర్పడి పులి గమనాన్ని ట్రాక్ చేస్తున్నారు. కాగా.. మంగళవారం నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకుండా ఉండాలని, చేలలో అమర్చిన విద్యుత్ కంచెలను తొలగించాలని కోరా రు. పులికి హానీ తలపెట్టవద్దని ప్రజలకు నష్టం కలిగితే తగిన పరిహారం చెల్లిస్తామని అన్నారు. ఆమెతో రేంజ్ ఆఫీసర్లు వేణుగోపాల్, జీవీ రామకృష్ణ, నజీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.