ములుగు జిల్లా మత్స్యశాఖకు పట్టిన అవినీతి జలగ ఇంకా వదలడం లేదు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో జరిగిన వాటాల పంచాయతీ చిలికి చిలికి గాలి వానలా మారింది.
కుంటాల మండలంలోని అంబుగాంకు చెందిన పశువుల కాపరులు మారుతితోపాటు మరో ఇద్దరు అడవిలో పశువుల మందను పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పెద్దపులి మందలోని ఆవు మెడ, కాలుపై దాడి చేసి గాయపర్చింది.