మహిళా దినోత్సవ కానుకగా పలు పథకాలు ప్రకటన
60 ఏళ్లు నిండిన వారికి ఉచిత ప్రయాణం
గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సీట్ల కేటాయింపు
నిర్మల్ టౌన్, మార్చి 8 : నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కారు ఒకవైపు ప్రయత్నిస్తుండగా.. ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ప్రయాణికుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇం దులో భాగంగా వినూత్న పథకాలకు శ్రీకారం చు డుతున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, డీల క్స్, రాజధాని తదితర బస్సుల్లో ప్రయాణం చేస్తు న్న వారిలో ఎక్కువశాతం మహిళలే ఉంటున్నా రు. దీనిని దృష్టిలో ఉంచుకొని మహిళా దినోత్స వం సందర్భంగా అతివకు అధిక ప్రాధాన్యమిచ్చా రు. వారి కోసం రాయితీ పథకాలను ప్రకటించా రు. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఆర్టీసీ బ స్సుల్లో 60 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. బస్సులో ప్రయాణించే గర్భిణులు, బాలింతలకు పల్లె వెలుగు బస్సుల్లో 6, 4, ఎక్స్‌ప్రెస్‌లో 1, 2 సీట్లను కేటాయించారు. ఈతరం మహిళలు ఎక్కడ ఎక్కినా ఆ సీట్లలో కూ ర్చోబెట్టడం కండక్టర్ బాధ్యతగా గుర్తించారు.
మా ర్చి 31వరకు మహిళా సంఘాలు తయారు చేసిన ఆహార వస్తువులను బస్టాండ్లలో అమ్ముకునేందు కు అవకాశం కల్పించారు. దీంతో పాటు మహిళలకు డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 1 నుంచి 31 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన మహిళలు టికెట్‌పై పేరు, ఊరు, చిరునామా రాసి ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వేస్తే లక్కీడీప్ ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాలతో మహిళల్లో సం తోషం వ్యక్తమవుతున్నది. దీనికితోడు బస్టాండ్లలో మహిళలు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, నిర్మల్, భైంసా, మంచిర్యాల డిపోలుండగా.. మొత్తం 629 బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 2.50 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. సుమారు 1.70 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కల్పిస్తున్న ఈ పథకాలపై పలువురు తమ మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సులో ప్రయాణం చేసే గర్భిణులకు సీట్ల కేటాయిం పు, లక్కీడీప్ ద్వారా బహుమతులు వంటి వాటితో ఆదరణ పెరుగుతున్నది. కరోనా అనంతరం ఆర్టీసీని నష్టాల్లోంచి బయటపడేసేందుకు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకారం అందిస్తుండడం సంతోషంగా ఉంది.
–ఈస్టర్ ప్రభులత, ఆర్ఎం, ఆదిలాబాద్