తాంసి, అక్టోబర్ 22: రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గోట్కూరి, ఈదుల్లా సవర్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అనిల్ జాదవ్‌కు ఘన స్వాగతం పలికారు. గోట్కూరి నుంచి ఈదుల్లా సవర్గాం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈదుల్లా సవర్గాంలో ప్రజల సమస్యలను తెలుసుకొని గెలిచాక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. దుర్గామాతల వద్ద స్థానిక నాయకులతో కలిసి పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తాటిపల్లి రాజు, కుమ్ర సుధాకర్, ఎంపీపీ సురకుంటి మంజులా శ్రీధర్ రెడ్డి, సర్పంచ్‌లు స్వప్న రత్న ప్రకాశ్, మునేశ్వర్ భరత్, సదానందం, వెంకన్న తూర్పుబాయి యశ్వంత్, అలాలి జ్యోతి నర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు సంజీవ్ రెడ్డి, మహేందర్, అరుణ్‌కుమార్, రజినీకాంత్ రెడ్డి, అశోక్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 22: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్సే రావాలని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో శారద, దుర్గామాతలను ఆయన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి , జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపెల్లి రాజు, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్నతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. మహా అన్నదానంలో పాల్గొన్నారు.
అనిల్‌జాదవ్ మాట్లాడుతూ రైతులు, మహిళలు , అన్ని వర్గాలకు అవసరమైన పథకాల అమలు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. పిప్పల్‌కోటిలో దేవీ పూజలు, అన్నదానంలో ముస్లింలు పాల్గొనడం మత సామరస్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్య క్రమంలో సర్పంచులు కేమ కళ్యాణి, మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, ఉపసర్పంచులు దొంతుల సుభాష్, జాదవ్ రవీందర్, నాయకులు మార్సెట్టి అనిల్, ఆకటి నరేందర్‌రెడ్డి , జీ నరేందర్, షేక్ అఫ్రోజ్, కునార్పు వినోద్, వివిధ గ్రా మాల ప్రజలు ఉన్నారు.