నెన్నెల, జనవరి 13 : నెన్నెల మం డలం బొప్పారం గ్రామ సమీపంలోని సర్వే నం 674లో గల ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకాలు ఆగడంలేదు. మూడు రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నా యి. అనుమతులు లేకుండా సదురు కాం ట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పత్తి చేన్ల మధ్య నుంచి మట్టి తవ్వుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నిత్యం 50 నుంచి 60 ట్రిప్పుల లారీల్లో మొరాన్ని తరలిస్తున్నారు. వాటి నుంచి వ చ్చే దుమ్ముంతా చేన్లపై పడి పత్తి నల్లబడుతుననదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క లారీలో దాదాపు 20 క్యూబి క్ మీటర్ల వరకు మొరం తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై నెన్నెల తహసీల్దార్ సబ్బ రమేశ్ణు వివరణ కోరగా, అనుమతులు లేకుండా లారీల్లో మొరం తవ్వుతున్న ప్రభుత్వ భూమి వద్దకు వెళ్లి, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.