చెన్నూర్, డిసెంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు శనివా రం పార్టీ సీనియర్ నాయకుడు రాజా రమేశ్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని అస్నాద్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందు కు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పండుగలకు ప్రతీక అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో నుంచి మాయం చేస్తున్నారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతులు, పేద లు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభత్వమేనని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి పెడి తే.. తాము అధికారంలోకి వచ్చిన గంటలోపే వాటన్నింటినీ తొలగిస్తామన్నారు. ఇప్పటికైనా ఆ ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశా రు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కో టపల్లి సింగిల్‌విండో చైర్మన్ సాంబాగౌడ్, కౌ న్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, కో ఆ ప్షన్ సభ్యుడు ఆయూబ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు మేడ సురేశ్‌రెడ్డి, నాయిని సతీశ్ రాజ్, జడల మల్లేశ్, ఈర్ల మల్లికార్జున్, ఆశీష్, బోగే భారతి, బడికెల శ్రావణ్, నాయబ్, ప్రశాంత్, అన్వర్, మల్లేశ్, విజయ్, నెన్నల భీమయ్య పాల్గొన్నారు.