రామకృష్ణాపూర్, మార్చి 4: ప్రజాభవన్ ము ట్టడి కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న అంగన్వాడీ సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మంగళవారం రామకృష్ణాపూర్‌లోని రాజీవ్‌చౌక్, ‘బీ’ జోన్ సెంటర్లో 11మంది అంగన్వాడీ సి బ్బంది హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముట్ట డి వెళ్లేందుకు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారని పట్టణ ఎస్ఐ తెలిపారు. వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నందున ముంద స్తు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీ సుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
అక్రమఅరెస్టులు సరికాదు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 4: మినీ అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ బయలుదేరుతున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. ప్రజా దర్బార్ హైదరాబాద్‌లోని ప్రజావాణిలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో మినీ అంగన్వాడీలతో పాటు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాల్సింది పోయి అరెస్టులు చేయించడంతో సమస్య పరిషారం కాదన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు.