జైనూర్ : హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని జైనూర్ పోలీసులు కుమ్రం భీమ్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ ( Awareness Rally ) నిర్వహించారు. సుమారు వంద ద్విచక్ర వాహనాల యజమానులతో హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ ఈ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మనకోసం, మన ఇంటి వాళ్లు ఎదురు చూస్తుంటారని, మన ప్రాణాలు మన కుటుంబానికి ఎంతో ముఖ్యమని గుర్తించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎసై రవికుమార్, పోలీస్ ప్రత్యేక సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.