కౌటాల, డిసెంబర్ 25 : మండలంలో బుధవారం మనుస్మృతి దివస్‌ను బౌద్ధ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బుద్ధవిహార్ నుంచి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. అనంతరం ప్రాణహిత నది పుష్కర ఘాట్ల వద్ద మనుస్మృతి ప్రతులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
పార్లమెంట్లో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని బౌద్ధ మతస్తులు, మహర్లు, నేతకానీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.