మంచిర్యాలటౌన్, అక్టోబర్ 15: నేరాల నియంత్రణకు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సె ప్టెంబర్ నెలకు సంబంధించి నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పరిషార శాతం పెంపు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, నేరాల నివారణ చర్యలపై స్టేషన్ల వారీగా వివరాలు తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్ధతులతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసులలో బాధితులకు పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
పెండింగ్ కేసుల్లో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎకువ శాతం యువత చనిపోతున్నారని తెలిపారు. విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు, రోడ్ సేఫ్టీ వలంటీర్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నా రు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై నిఘా ఉంచాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని ఉపేక్షించవద్దన్నారు. సమావేశంలో మంచిర్యాల, పెదపల్లి డీసీపీలు ఏ. భాస ర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి ఏసీపీలు ఎం. రమేశ్, ఆర్ ప్రకాశ్, జీ. కృష్ణ, రవి కుమార్, వివిధ విభాగాల ఏసీపీలు శ్రీనివాస్, నాగేంద్ర గౌడ్, ప్రతాప్, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.