సీసీసీ నస్పూర్, అక్టోబర్ 27 : మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. సోమవారం నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో 2025-27కు సంబంధించిన మద్యం షాపులను లక్కీ లాటరీ ద్వారా కేటాయించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ కుమార్ దీపక్ రాగానే.. ప్రారంభమైన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల దాకా నిర్విరామంగా సాగింది. జిల్లాలోని మంచిర్యాల, బె ల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్ స్టేషన్ల పరిధిలో మొ త్తం 73 వైన్ షాపులకు 1712 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ఆయా ప్రాంతాల నుంచి మద్యం వ్యా పారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. దరఖాస్తుదారులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. లక్కీడ్రా కార్యక్రమా న్ని స్టేషన్ల వారీగా విభజించారు. ముందుగా మంచిర్యాల, లక్షెట్టిపేట స్టేషన్లకు సంబంధించి లక్కీడ్రా నిర్వహించిన అనంతరం చెన్నూర్, బెల్లంపల్లితో ఈ ప్రక్రి య ముగించేశారు. ఒక్కో షాపునకు 10 నుంచి 20 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. కలెక్టర్ లక్కీ డ్రా తీసి నంబర్ల ద్వారా ఎంపికైన విజేతలను ప్రకటించారు. లక్కీ డ్రాలో తమ నంబర్ వచ్చిన వారంతా సంబురాలు చేసుకున్నారు. ఈ కిక్కు ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎంపిక కాని వారంతా నిరాశతో వెనుదిరగడం కనిపించింది.
పారదర్శకంగా షాపుల కేటాయింపు : కలెక్టర్
మంచిర్యాల జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. లక్కీ డ్రా పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రి య మొత్తం పూర్తయిన తర్వాత ఆయన జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నందగోపాల్తో కలిసి మీడియాతో మా ట్లాడారు. జిల్లాలో మొత్తం 73 షాపులకు 1712 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకా రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొత్తగా మద్యం షాపులు దక్కించుకొని లైసెన్స్లు పొందిన వారు డిసెంబర్ నెల నుంచి మద్యం అమ్మకాలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో 25 దుకాణాలు
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 27 : కలెక్టరేట్లో సోమవారం జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ అధ్యక్షతన కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో లకీ డ్రా నిర్వహించారు. మొత్తం 32 మద్యం దుకాణాలు కాగా, దరఖాస్తులు తకువ వచ్చాయి. దీంతో 7 దుకాణాల కేటాయింపును వాయిదా వేశారు. మిగతా 25 దుకాణాలకు లకీ డ్రా నిర్వహించారు. 632 మంది దరఖాస్తు దారులు తరలివచ్చారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ లకీ డ్రా ని ష్పక్షపాతంగా సాగిందని, నిబంధనలు పాటిస్తూ దుకాణాలు నడుపాలని సూచించారు.