ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు ( Liquor shops ) 2025- 27 సంవత్సరానికి గాను 4 ఎస్సీ, ఒకటి ఎస్టీ, రెండు గౌడ కులస్తులకు రిజర్వేషన్ ( Reservations) ప్రకారం లక్కి డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ( Collector Venkatesh Dhotre ) అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఆదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా ఆబ్కారీ- మధ్య నిషేధ శాఖ అధికారి జ్యోతి కిరణ్తో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ సంబంధిత డ్రా కార్యక్రమానికి హాజరయ్యారు
. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 32 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేశామన్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 4, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 1, సిర్పూర్ – టి మండల కేంద్రంలోని షాపు షెడ్యూల్ కులాల వారికి, రెబ్బెన మండలం గోలేటి, బెజ్జూర్ మండల కేంద్రంలోని షాపు గౌడ కులస్తులకు, కౌటాల మండల కేంద్రంలోని ఒక షాపు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించామని వెల్లడించారు.
మద్యం షాపుల కోసం దరఖాస్తులను అక్టోబర్ 18 వ తేదీ వరకు జిల్లా ఆబ్కారీ- మధ్య నిషేధ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 23న కలెక్టరేట్లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.