రూ. 2,500కోట్ల వ్యాపారమే లక్ష్యం
రాష్ట్రంలో తెలంగా ణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఏడాది రూ.2,500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ వై శోభ పేర్కొన్నారు.
నిర్మల్ టౌన్, జూన్ 27 : రాష్ట్రంలో తెలంగా ణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఏడాది రూ.2,500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ వై శోభ పేర్కొన్నారు. రీజియన్ మేనేజర్ రామారావుతో కలిసి నిర్మల్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో మంగళవారం ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడారు. రాష్ట్రంలో 427 తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచులున్నాయని తెలిపారు. వీటి పరిధిలో గతేడాది రూ.19 వేల కోట్ల వ్యాపారం నిర్వహించామని, ఈసారి మరో రూ.6 వేల కోట్ల ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణ బ్యాంకు ద్వారా రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, పారిశ్రామిక రంగం, గృహ నిర్మాణానికి పెద్దఎత్తున రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్లను గణనీయంగా పెంచుకున్నట్లు తెలిపారు. తమ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు పూర్తి భరోసా ఇవ్వడం వల్లే ఖాతాదారులు సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ శోభ అన్నారు. కల్లూర్లో మహిళా సంఘాలకు రుణ వితరణ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఒక్కొక్క సంఘానికి రూ.10-20 లక్షల రుణం అందజేయనున్నట్లు తెలిపారు. పొదుపు, రికవరీ విషయంలో నిర్ల క్ష్యం తగదన్నారు. వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా సంఘాలు నగ దు రహిత లావాదేవీలు నడపాలన్నారు. రికవరీ లో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో ఉందని, రుణాలు పొందడంలోనూ నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మంచినీటిలో చేపల పెంపకంపై రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సం ఘాలకు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం జ్ఞాను, విజయలక్ష్మి, ఏపీడీ గోవింద్ రావు, ఆర్ఎం బా పురావు, ఆయా మండలాల ఐకేపీ ఏపీఎంలు సీ సీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

