ఉట్నూర్/నార్నూర్/ఇంద్రవెల్లి, డిసెంబర్ 19 : కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించి మా పొట్ట కొడుతున్నదని, మా బతుకులను ఆగం చేస్తున్నదని ఆటో డ్రైవర్లు, ఓనర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉట్నూర్ పట్టణం, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల ఉట్నూర్ మండల శాఖ గౌరవ అధ్యక్షుడు దావుల రమేశ్, నార్నూర్ మండల ఆటో యూనియన్ సంఘం మండలాధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, ఇంద్రవెల్లి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గాయక్వాడ్ భారత్ మాట్లాడారు. ఆటోల మీదనే ఆధారపడి జీవించే మా పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఫైనాన్స్‌లు కట్టక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.