ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 27 : సరైన వైద్యం అందించకుండా అధిక బిల్లులు వేశారని, అర్హత లేని వైద్యురాలితో చికిత్స అందిస్తున్నారని, అనుమతి లేకుండా దవాఖానను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిరుమల పిల్లల, జనరల్ దవాఖాన ఎదుట శుక్రవారం రోగి బంధువులు ఆందోళన చేశారు. రోగి బంధువు లు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ పట్టణానికి చెందిన పాదం మల్లవ్వకు అనారోగ్యంతో తిరుమల పిల్లల, జనరల్ దవాఖానకు వచ్చింది.
రెండు గంటల పాటు చికిత్స అం దించి రూ.3450 వేల బిల్లు తెల్లకాగితంపై వే సి ఇచ్చారు. సరైన వైద్యం అందించకుండానే బిల్లు వసూలు చేయడంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దవాఖాన ఎదుట ఆం దోళన చేశారు. వీరికి పలువురు పట్టణ వాసు లు మద్దతు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా దవాఖాన నిర్వహిస్తున్నారని, డాక్టర్ సౌజన్యకు ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం అందించడంపై యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయమై దవాఖాన యాజమాన్యాన్ని వివరణ కోరగా మహిళ వైద్యురాలు ఇటీవలే ఎంబీబీఎస్ పరీక్ష రాసిందని ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. క్వాలీఫైడ్ డాక్టర్ లేకపోవడంతోనే దవాఖానకు అనుమతి తీసుకోలేదని తెలపడం గమనార్హం.
తిరుమల పిల్లల, జనరల్ దవాఖానను నిర్మల్ డీఎంహెచ్‌వో రాజేందర్ తనిఖీ చేశారు. దవాఖానకు అనుమతి లేదని, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత లేకుండా సౌజన్య చికిత్స అందించినట్లు గుర్తించారు. మరో వైద్యుడు దినేశ్‌కుమార్ ఎంబీబీఎస్‌లో ఉండే చికిత్స మాత్రమే అందించాలని, పిడియాట్రిక్ చికిత్స చేయవద్దన్నారు. సౌజన్య చికిత్స అందించవద్దని ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నందుకు యాజమాన్యానికి జరిమానా విధిస్తామన్నారు.