కాసిపేట, నవంబర్ 8 : పింఛన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్ సారుదే. మళ్లీ ఆయనే సీఎం అయితడు. మళ్లో సారి పెంచుతామని హామీ ఇచ్చిన్రు. ఇగ కచ్చితంగా అమలు చేసి తీరుతరు. చాలా ఆనందంగా ఉంది. పెద్ద మనుషులు ఇబ్బందులు పడుతరనే ఇలాంటి ఆలో చన చేసి పింఛన్ పెంచి ఇస్తనని కేసీఆర్ సారు చెబు తున్నరు. ఇగ ఆయన మళ్లా గెలుసుడు పక్కా.ఋ -భూపల్లి కవిత
కాసిపేట, నవంబర్ 8 : సింగరేణిలో కారుణ్య నియా మకాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే. నేను ఉ ద్యోగం చేస్తున్నా అంటే అది కారుణ్య నియామకాల వల్లే సాధ్యమైంది. సింగరేణిలో అన్ని వర్గాల కార్మికు లకు అన్ని రకాల హక్కులు, సేవలు అందుతు న్నా యి. కార్మికులు అంతా సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎ స్ ప్రభుత్వాకి అండగా ఉంటాం. బెల్లంపల్లి సభకు వచ్చిన కార్మికులమంతా సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వంకు మద్దతుగా ఉంటామని చెప్పేందుకే భారీగా తరలివచ్చాం. -పానగంటి రవి కాంత్ (సింగరేణి కార్మికుడు)
మాకు నమ్మకం ఉంది
కాసిపేట, నవంబర్ 8: మహిళల అభ్యున్నతి సీఎం కే సీఆర్తోనే సాధ్యం. మహిళలకు రూ.3వేలు గౌరవ భృతి ఇస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన కచ్చితంగా ఇస్తారు. మాకు నమ్మకం ఉంది. మళ్లీ గెలు స్తాడు. మహిళలకు గౌరవ భృతి అందిస్తాడు. మన రాష్ట్రంలో మహిళలకు ఉన్న పథకాలు ఎక్కడా లేవు. మరిన్ని పథకాలు అందిస్తారని నమ్మకం ఉంది.
-సాజితా బేగం
సీఎం కేసీఆర్ సారే రావాలని గ్రామాల్లో ప్రతి ఒక్క రం కోరుకుంటున్నాం. మళ్లీ సారు వస్తాడు. మరిన్ని పథకాలు అమలు చేస్తడు. అన్ని సామాజిక వర్గాల ప్రజల అభివృద్ధి, సమ న్యాయం చేస్తుంది సీఎం కేసీఆర్ సారే. ఎవరి మాటలను మేము నమ్మం. న మ్మకం అంటేనే సీఎం కేసీఆర్. మాట ఇచ్చాడు అంటే చేసి తీరుతడు. అదే నమ్మకంతోనే సీఎం కేసీఆర్ సారే మళ్లీ రావాలని కోరుకుంటున్నాం. బెల్లంపల్లి సభకు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వచ్చాను.
-సల్లూరి ప్రభాకర్
కెరమెరి, నవంబర్ 8: నా పేరు భూషణ్. మాది మ హారాష్ట్రలోని రాజురా తాలుక. తెలంగాణలో బీఆర్ఎ స్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సూపర్. రై తులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూ త్న పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలోనే తెలంగా ణ నంబర్ వన్‌గా అభివృద్ధ్ది చెందుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం తె లంగాణ ప్రజల అదృష్టం. మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండేది.
-భూషణ్ రాజురా(మహారాష్ట్ర)
కెరమెరి, నవంబర్ 8: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సా ధ్యం. రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ హ యాంలోనే మారుమూల గ్రామాలు పల్లెలు అభివృ ద్ధి పథంలో నడుస్తున్నాయి. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయల కల్పన జరిగింది. మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ పల్లెలు మరింత అభివృద్ధి సాధిస్తాయి.
-బొట్టుపల్లి గోపాల్, రాజురా
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ఎందుకం టే బీఆర్ఎస్ పాలన నుంచే రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి సహాయం కింద రైతు బంధు పథకం పెట్టిన్రు. దురదృష్టంగా రైతు మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమాను తెచ్చిండు సీఎం సారు. అప్పటి నుంచే రైతు ఆత్మహత్యలు తగ్గి రైతు లకి అప్పులు లేకుండా పంట దిగుబడి పెరిగి అభివృద్ధి సాధిస్తున్నడు. మళ్లా కే సీఆర్ సార్ సీఎం అయితేనే రైతులు ఇంకా అభివృద్ధి సాధిస్తారు.
-పెందోర్ సీతారాం, శెట్టిహడ్ప్నూర్(సిర్పూర్ యు)