ఇంద్రవెల్లి : మండలంలోని దోడంద గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువ రైతు తుంరం ధాను తనకు వచ్చిన విభిన్న అలోచనతో ఆదివారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్ కల్టివేటర్ పై వ్యవసాయ కూలీలను కూర్చోబేట్టి సరతలతో విత్తనాలు వేయించి అదుర్స్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన రైతులు మాత్రం విత్తనాలు వేసేందుకు వివిధ రకాల యాంత్రలతోపాటు మిషనలను వాడకున్నారు.
కానీ మండలంలోని దోడంద గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువ రైతు తుంరం ధాను తనకు వచ్చిన భిన్నమైన అలోచనతో ట్రాక్టర్ కల్టివేటర్ పై చెక్కులు ఏర్పాటు చేసి దానిపై ఐదుగురు మహిళ కూలీలను కూర్చోబెట్టి సరతలతో 40బ్యాగుల మక్కజొన్న విత్తనాలు వేయించాడు. విభిన్నమైన పద్ధతిలో వ్యవసాయ పనులు చేయిస్తూ అందరిని ఆకర్శించుకున్నాడు. రైతుకు వచ్చిన అలోచనను చూసిన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆ రోడ్డు వైపున వెళ్తున్న ప్రతీ ఒక్కరూ అసక్తిగా చూశారు.