Dandari Ustavalu | కాసిపేట, అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు వెంకటాద్రి గుడి వద్ద ఆదివాసీ దండారీ ఉత్సవాలు మొదటి రోజు బుధవారం సాయంత్రం ఆదివాసీలు ఘనంగా ప్రారంభించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు డోలు వాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేసి జెండా ఆవిష్కరణ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల ఆదివాసీ గ్రామాల దండారీలు సల్పాలవాగు చేరుకున్నారు. మొదటి రోజు ప్రత్యేక పూజలు ముగియగా, రెండో రోజు గురువారం ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రదర్శనలు, దండారీ దర్బార్ నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, దండారీ దర్బార్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.