ఎదులాపురం, మే 4 : విద్యార్ధి దశలోనే వ్యాయామం ప్రాధాన్యతను గుర్తెరిగి.. మొబైల్ ఫోన్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచిం చారు. వేసవిలో విద్యార్థుల కోసం పొలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాం పును సోమవారం ప్రారంభించారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో వేసవి శిబిరా న్ని ప్రారంభించి విద్యార్థులకు సూచనలు చేశారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ వేసవి శిబిరాలు ప్రారంభించారు.
ఎస్పీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ఆర్చరీ, వాలీబాల్ ఆడి సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంపులో టేబుల్ టెన్నీస్, ఆర్చరీ, యోగ, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాసెట్ బాల్, పీఈటీతోపాటు పోలీస్ స్టేషన్ సందర్శన, నిర్వహణ, జైలు సందర్శన, జాగిలాల పనితీరుపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, మావల ఎస్‌హెచ్‌వో రాహుల్‌కాంత్, ఇన్స్పెక్టర్లు కె.నాగరాజు, బి.సునీల్ కుమార్, ప్రేమ్‌కుమార్, జి.శ్రావణ్ పాల్గొన్నారు.
పశువుల రవాణా కట్టడికి చర్యలు
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చెక్‌పోస్ట్ సిబ్బందికి ఎస్పీ పలు సూచ నలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పిప్పర్వాడ, ఆనంద్‌పూర్, శంకర్ గూడ, లక్ష్మీపూర్, లోకారి, ఉట్నూర్ ఎక్స్ రోడ్, ఘన్పూర్ చెక్ పోస్టుల వద్ద 24 గంటలు షిఫ్ట్ విధానంలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఎస్సై స్థాయి అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తారని పేరొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువులతో ఉన్న వాహనాల పత్రాలు, పరిస్థితిని పరిశీలించాలన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులను గుర్తిస్తే గోశాలలకు తరలించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్‌కుమార్, నాగరాజు, ప్రేమ్ కుమార్, శ్రావణ్, సిహెచ్ రమేశ్ పాల్గొన్నారు.