ఎదులాపురం, జూన్ 3 : ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 37 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలను తనిఖీ చేయగా ఆరు వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 54 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేరొన్నారు. ఇద్దరు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
గంజాయి, సైబర్ నేరాలు, ఉద్యోగ మోసాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు కె.నాగరాజు, రహీం పాషా, కె.ఫణిదర్, ఎస్సైలు వి.విష్ణువర్ధన్, దేవేందర్ పాల్గొన్నారు.