జైనథ్, జూలై 27 : యువత చదువుకు ప్రాధాన్యతనిపేంత ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం మండలంలోని కోరట, గిమ్మ, తిరోడ గ్రామాల్లోని ప్రజలు, యువతతో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ముఖ్యంగా వర్షకాలంలో బ్రిడ్జిలు, వాగులపై నుంచి దాటకూడదన్నారు. అనంతరం మూడు గ్రామాల యువతకు వాలీబాల్ స్పోర్ట్స్ కిట్స్‌ను అందజేసి ప్రోత్సహించారు.
చనాక-కొరట బ్యారేజీ పరిశీలన
తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుపై నిర్మించిన చనాక-కొరట బ్యారేజీని ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెన్‌గంగా నదీ ప్రవాహన్ని పరిశీలించారు. వర్షకాలంలో ప్రాజెక్టు, జలపాతల వద్ద పోలీసు నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై గౌతం నాయక్ పాల్గొన్నారు.