పడిపోతున్న ఉష్ణోగ్రతలు l14.7 డిగ్రీలు నమోదు
ఆదిలాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : జిల్లావాసులను చలి వణికిస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి చలి తీవ్రత అం తంత మాత్రంగానే ఉండగా.. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. శనివారం జిల్లాలో 14.7 డిగ్రీలు నమోదైంది. సా యంత్రం ప్రారంభమైన చలి ఉదయం 8 గంటల వరకు ఉంటున్నది.
అటవీ ప్రాం తంతోపాటు ఏజెన్సీలో చలి ప్రభావం అధికంగా కనపడుతున్నది. చలితోపాటు పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు ఉద యం సమయంలో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నా రు. ఉదయం, రాత్రి చలిమంటలు కాగుతున్నారు. స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు ధరిస్తున్నారు. ఉదయం సమయంలో చాయ్ దుకాణాల వద్ద జనం ఎక్కువగా కనపడుతున్నారు. ప్రజలు స్వెట్టర్లు, క్యాప్‌లు కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద గుమిగూడుతున్నారు. ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.