ఉత్తమ ఠాణాగా ఆదిలాబాద్ వన్‌టౌన్
పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్‌టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును వన్‌టౌన్ సీఐ కే సత్యనారాయణ అందుకున్నారు.
- డీజీపీ మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఐ
ఎదులాపురం, డిసెంబర్ 29 : పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్‌టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును వన్‌టౌన్ సీఐ కే సత్యనారాయణ అందుకున్నారు.
అవార్డుకు ఎంపిక విధానం ఇలా….
ప్రతి పోలీస్ స్టేషన్లో నేరాలు జరగకుండా ముందస్తుగా తెలుసుకొని ఆపడం. నమోదైన కేసుల్లో న్యాయస్థానంలో రుజువైన కేసులు, నేర పరిశోధన, బాధితులతో ప్రవర్తించే తీరు, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్, గార్డెనింగ్, కమ్యూనిటీ పోలీస్, సైబర్ క్రైం, రైటర్స్ పనితీరు, 100కు వచ్చిన కాల్స్‌కు సరైన స్పందన.. తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
కేటగిరీల వారీగా ఎంపిక
కేటగిరీ-1లో 1000కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యే పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఈ జాబితాలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని ఉప్పల్ ఠాణా నిలిచింది.
కేటగిరీ- 2లో 500 నుంచి 1000ఎఫ్ఐఆర్లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటిలో కోదాడ టౌన్ స్టేషన్ మొదటి స్థానం సాధించింది.
కేటగిరీ-3లో 250 నుంచి 500 ఎఫ్ఐఆర్లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటీలో ఆదిలాబాద్ వన్‌టౌన్ మొదటి స్థానం సాధించింది.
అందరి సహకారంతోనే సాధ్యం
సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను కేటగిరీ-3లో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ వన్‌టౌన్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఉమెందర్ల సలహాలు సూచనలు పాటించడంతో పాటు అందరి సహకారంతోనే ఇది సాధ్యం. భవిష్యత్‌లో మరిన్ని అవార్డుల కోసం కృషి చేస్తాం
-కే సత్యనారాయణ, సీఐ, వన్‌టౌన్ ఆదిలాబాద్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

