ఆదిలాబాద్ టౌన్, జనవరి 17 : రాష్ట్ర ప్రభు త్వం అన్ని కుల సంఘాలకు ప్రాధాన్యమిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా ఓం మహేశ్వర మాల జంగం సంఘం క్యాలెండర్‌ను పట్ణంలోని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పట్టణంలో ఓం శివ మహేశ్వర మాల జంగం సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని నాయకులు కోరారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాజరి వినోద్‌కుమార్, దేవళ్ల శంకరయ్య, గౌరవాధ్యక్షుడు రాజమల్లు, కోశాధికారి గాజరి సంతోష్, సంయుక్త కార్యదర్శి మాదం మల్లయ్య, కార్యవర్గ సభ్యులు గాజరి చం ద్రశేఖర్, గాజరి శ్రీకాంత్, మాటూరి లస్మ య్య, అల్గూరి జ్ఞానేశ్వర్, మాదం రామయ్య, కోదాడి రాజేశ్వర్, గణపురం రవి, తాండ్ర వెంకటేశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు గ్రూప్-3, -4 పరీక్షల స్టడీ మెటీరియల్‌ను చైర్మన్ జోగు ప్రేమేందర్ మంగళవారం పంపిణీ చేశారు. అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ స్టడీ సర్కిల్లో ఇటీవల శిక్షణ పొందిన అనేక మంది అభ్యర్థులు తమ లక్ష్య సాధనలో విజయాలు సాధించారని గుర్తు చేశారు. టీచర్ల బదిలీలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల పోస్టులను సైతం భర్తీ చేయనుందని వివరించారు. యువత సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదువుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, శ్రీవాణి, అనూష, నరేశ్, సాయి, రవి పాల్గొన్నారు.